‘నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’

Natyam: ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌ా రాజు ప్రధాన పాత్రలో నాట్య ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాట్యం’. ఇటీవల ఉపాసన చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించింది. బుధవారం ‘నాట్యం’ టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.

 

 

‘నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం నాట్యం, శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో సాగింది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.

నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ డైరెక్షన్‌తో పాటు.. స్క్రిప్ట్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా నిర్వర్తించడం విశేషం. క‌మ‌ల్‌ కామ‌రాజు, ఆదిత్య మీనన్, రోహిత్ బెహ‌ల్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ‘నాట్యం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.