ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ రేడియం విగ్రహాలు

NTR Radium Statues: విశ్వవిఖ్యాత, నటాసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డా. ఎన్టీఆర్.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు.. తరాలు మారినా తారకరాముని కీర్తి తరగనిది.. ఆయనపై అభిమానాన్ని ఎంతోమంది అభిమానులు పలు సందర్భాల్లో పలు రకాలుగా వ్యక్తపరిచారు. అయితే కూకట్‌పల్లికి చెందిన కొండలరావు కర్నాటి (కేకేఆర్ చౌదరి) అనే ఎన్టీఆర్ వీరాభిమాని వినూత్నంగా ఆలోచించారు. ఇంతకు ముందే ఆంధ్రుల ఆరాధ్యదైవం అన్నగారి రేడియం విగ్రహాలు తయారు చేయించారు.

 

ఈ ఏడాది ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా రేడియంతో పాటు మొట్టమొదటి సారి ఫైబర్‌తో ఎన్టీఆర్ విగ్రహాలు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కేకేఆర్ చౌదరి మాట్లాడుతూ :‘‘ప్రతి ఇంట్లో అన్నగారి రూపం – తెలుగు వారి ఆత్మగౌరవం’ అనే నినాదంతో.. ఆయన మహత్తర రూపం ప్రతి నిత్యం కళ్లముందు ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు, ఆఫీస్, కార్‌లో పెట్టుకునే విధంగా వివిధ సైజుల్లో అన్నగారి విగ్రహాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. రాత్రి పూట వెలిగేలా రేడియంతో పాటు ఫైబర్‌తో కూడా విగ్రహాలు ప్రత్యేకంగా తయారు చేయించాం.. అన్నగారి అభిమానులే కాకుండా తెలుగు వారందరూ కూడా ఈ విగ్రహాలను తమ ఇళ్లల్లో, ఆఫీసులు మరియు కార్లలో పెట్టుకుంటున్నారు.. విగ్రహాలు కావల్సిన వారు 9030643424 నెంబరును సంప్రదించగలరు..’’ అని తెలిపారు.

ఎన్టీఆర్ విగ్రహాలు.. వాటి ధరలు..
1000

2000

2500

ట్రెండింగ్ వార్తలు