సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైజాగ్ లో సందడి చేశారు. ఆయన ఎవరికీ చెప్పకుండా, వైజాగ్ బీచ్ లో వాకింగ్ చేయడంతో స్థానికులు ఆయన్ను గుర్తించి, అక్కడికి వెళ్లి ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇక అక్కడే ఉన్న కొందరు జాలర్లతో మాట్లాడిన పవన్, ఆ తరువాత అక్కడి నుండి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.