Ka Paul
KA Paul: ఇవాళ ఉదయం కాకినాడలో కనపడిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సాయంత్రం ఏలూరుకి వెళ్ళి సందడి చేశారు. రోడ్డుపక్కన ఉన్న దుకాణంలో టీ తాగుతూ అందరిని ప్రజాశాంతి పార్టీ వైపు రావాలంటూ కోరారు. ”తమ్ముడు పవన్ కల్యాణ్ నాతో వస్తే సీఎం అవుతారు.. బీజేపీతో ఉంటే సీఎం అవ్వలేరు” అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుందని, ఇక కుటుంబ పాలనను అంతమొందించాలని కేఏ పాల్ అన్నారు.
అందరూ కలిసి ప్రజాశాంతిని ప్రజాశాంతి పార్టీని ఆదరించాలని కోరారు. త్వరలో అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ప్రజాశాంతి పార్టీతో కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తానని కేఏ పాల్ చెప్పారు. కాగా, ఇవాళ ఉదయం కాకినాడలోని ఓ పాఠశాలలో కేఏ పాల్ కాన్వాయ్‌ను స్కూల్ సిబ్బంది అడ్డుకోవడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో తనకు తిరిగివ్వాల్సిన డబ్బు చెల్లిస్తేనే వదులుతామంటూ స్కూలు సిబ్బంది అన్నారు. చివరకు అక్కడి నుంచి కేఏ పాల్ వెళ్ళిపోయారు.
India vs West Indies: 98 పరుగులు చేశాక వర్షం పడడంపై శుభ్‌మన్ గిల్ అసంతృప్తి