India vs West Indies: 98 ప‌రుగులు చేశాక వ‌ర్షం ప‌డ‌డంపై శుభ్‌మ‌న్ గిల్ అసంతృప్తి

''శత‌కం పూర్తి చేస్తాన‌ని అనుకున్నాను. కానీ, వ‌ర్షం అనేది మ‌న నియంత్రణ‌లో ఉండ‌దు క‌దా? ఆ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డ‌డంతో నేను చాలా నిరాశ‌కు గుర‌య్యాను. మ‌రో ఓవ‌ర్ ఆట జ‌ర‌గాల్సింది. నేను ఇదే ఆశించాను. నేను ఈ మూడు వ‌న్డేల్లోనూ బాగానే ఆడాను. నా ప్ర‌ద‌ర్శ‌న పట్ల మాత్రం సంతృప్తిగానే ఉన్నాను'' అని శుభ్‌మ‌న్ గిల్ చెప్పాడు.

India vs West Indies: 98 ప‌రుగులు చేశాక వ‌ర్షం ప‌డ‌డంపై శుభ్‌మ‌న్ గిల్ అసంతృప్తి

Shubman

India vs West Indies: వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌లో జ‌రిగిన‌ మూడో వ‌న్డేలోనూ టీమిండియా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ వ‌న్డేలో ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్ అర్ధ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. శిఖ‌ర్ ధావన్ 74 బంతుల్లో 58 ప‌రుగులు చేసి వాల్ష్ బౌలింగ్‌లో నికోల‌స్‌ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, శుభ్‌మ‌న్ గిల్ మాత్రం చివ‌రి వ‌ర‌కు క్రీజులోనే నిలిచాడు. అయితే, త్రుటిలో శతకం చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు. శుభ్‌మన్‌ గిల్ 98 బంతుల్లో 98 ప‌రుగులు చేసిన స‌మ‌యంలో వ‌ర్షం ప‌డింది. దీంతో ఆటను అక్క‌డితో నిలిపివేశారు.

ఇన్నింగ్స్‌లో అక్క‌డితో ముగించ‌డంతో శ‌త‌కం చేసే అవ‌కాశాన్ని కోల్పోయినందుకు శుభ్‌మ‌న్ గిల్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ”శత‌కం పూర్తి చేస్తాన‌ని అనుకున్నాను. కానీ, వ‌ర్షం అనేది మ‌న నియంత్రణ‌లో ఉండ‌దు క‌దా? ఆ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డ‌డంతో నేను చాలా నిరాశ‌కు గుర‌య్యాను. మ‌రో ఓవ‌ర్ ఆట జ‌ర‌గాల్సింది. నేను ఇదే ఆశించాను. నేను ఈ మూడు వ‌న్డేల్లోనూ బాగానే ఆడాను. నా ప్ర‌ద‌ర్శ‌న పట్ల మాత్రం సంతృప్తిగానే ఉన్నాను” అని శుభ్‌మ‌న్ గిల్ చెప్పాడు.

కాగా, మూడు వ‌న్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టీమిండియా గెల‌వ‌డంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. మూడో వ‌న్డేలో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్ఎస్) ప‌ద్ధ‌తిలో 119 ప‌రుగుల తేడాతో గెలిచింది. శుభ్ మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

viral video: పిల్లలతో ప్లాస్టిక్ కుర్చీలు వేయించుకుని వరద నీటిని దాటిన టీచర్