viral video: పిల్లలతో ప్లాస్టిక్ కుర్చీలు వేయించుకుని వరద నీటిని దాటిన టీచర్

ఓ పాఠ‌శాల వ‌ద్ద వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. విద్యార్థులు అంద‌రూ అందులో నుంచే న‌డుచుకుంటూ బ‌డికి వెళ్తున్నారు. అయితే, ఓ ఉపాధ్యాయురాలు మాత్రం బ‌డిలోకి ప్రవేశిస్తూ ఆ వ‌ర్ష‌పు నీరు త‌న‌కు అంట‌కుండా వెళ్ళాల‌ని భావించింది. పిల్ల‌ల‌తో ఆ నీటిలో వ‌రుస‌గా కుర్చీలు వేయించింది. ఆ కుర్చీల‌ను ఎక్కి వ‌ర్ష‌పునీటిని దాటింది. కుర్చీల మీదుగా ఆ నీటిని దాటుతోన్న స‌మ‌యంలోనూ కింద ప‌డ‌కుండా ఓ విద్యార్థిని ప‌ట్టుకుంది.

viral video: పిల్లలతో ప్లాస్టిక్ కుర్చీలు వేయించుకుని వరద నీటిని దాటిన టీచర్
ad

viral video: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఓ పాఠ‌శాల వ‌ద్ద వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. విద్యార్థులు అంద‌రూ అందులో నుంచే న‌డుచుకుంటూ బ‌డికి వెళ్తున్నారు. అయితే, ఓ ఉపాధ్యాయురాలు మాత్రం బ‌డిలోకి ప్రవేశిస్తూ ఆ వ‌ర్ష‌పు నీరు త‌న‌కు అంట‌కుండా వెళ్ళాల‌ని భావించింది. పిల్ల‌ల‌తో ఆ నీటిలో వ‌రుస‌గా కుర్చీలు వేయించింది. ఆ కుర్చీల‌ను ఎక్కి వ‌ర్ష‌పునీటిని దాటింది. కుర్చీల మీదుగా ఆ నీటిని దాటుతోన్న స‌మ‌యంలోనూ కింద ప‌డ‌కుండా ఓ విద్యార్థిని ప‌ట్టుకుంది.

ఆ స‌మ‌యంలో ఆ విద్యార్థి నీటిలోనే ఉన్నాడు. ఆ టీచ‌ర్ వ‌ర‌ద నీటిని దాటుతుండ‌గా ఒక‌రు తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళ‌డంతో స‌దరు టీచ‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. వ‌ర‌ద నీటిని దాటేందుకు పిల్ల‌ల‌తో కుర్చీలు వేయించుకున్న టీచ‌ర్‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


frequent naps: ప‌దేప‌దే కునుకు తీస్తున్నారా?