frequent naps: ప‌దేప‌దే కునుకు తీస్తున్నారా?

ఈ ధోర‌ణి స‌రికాద‌ని, దీని వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు, స్ట్రోక్‌ ముప్పు ఉంటుంద‌ని తాజాగా ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫ‌లితాలను అమెరికన్ హార్ట్ అసోసియేష‌న్ జ‌ర్న‌ల్ హైపర్ టెన్షన్‌లో ప్ర‌చురించారు. ప‌దే ప‌దే కునుకు తీయ‌డానికి అధిక ర‌క్త‌పోటు, స్ట్రోక్‌కు సంబంధం ఉందా? అన్న అంశంపై చైనా ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేశారు.

frequent naps: ప‌దేప‌దే కునుకు తీస్తున్నారా?

Naps

frequent naps: ప్ర‌తిరోజు 8 గంటల పాటు నిద్రపోవాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో కాసేపు కునుకు తీయడం వల్ల కూడా చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని కూడా ఇప్ప‌టికే చాలా మంది ప‌రిశోధ‌కులు ప‌లుసార్లు తెలిపారు. రాత్రి స‌మ‌యంలోనే కాకుండా ఉద‌యం/మ‌ధ్యాహ్నం/సాయంత్రం చాలా మంది కాసేపు నిద్ర‌పోతుంటారు. మ‌రికొంద‌రైతే ప‌దే ప‌దే కునుకు తీస్తుంటారు. ఇలా కునుకు తీయ‌డం అంటే మ‌నలో చాలా మందికి ఎంతో ఇష్టం. కోట్లాది మందికి ఈ అల‌వాటు ఉంటుంది.

అయితే, ఈ ధోర‌ణి స‌రికాద‌ని, దీని వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు, స్ట్రోక్‌ ముప్పు ఉంటుంద‌ని తాజాగా ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫ‌లితాలు అమెరికన్ హార్ట్ అసోసియేష‌న్ జ‌ర్న‌ల్ హైపర్ టెన్షన్‌లో ప్ర‌చురించారు. ప‌దే ప‌దే కునుకు తీయ‌డానికి అధిక ర‌క్త‌పోటు, స్ట్రోక్‌కు సంబంధం ఉందా? అన్న అంశంపై చైనా ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేశారు. ఇటువంటి అంశంపై దీర్ఘ‌కాలం పాటు జ‌రిగిన మొట్ట‌మొద‌టి ప‌రిశోధ‌న త‌మ‌దేన‌ని వారు చెప్పారు.

ఈ ప‌రిశోధ‌నలో భాగంగా 40 నుంచి 69 ఏళ్ళ మ‌ధ్య ఉన్న‌ 5,00,000 మంది ఆరోగ్య వివ‌రాలు, వారి అల‌వాట్లపై శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌యం చేశారు. వారి నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా ర‌క్తం, మూత్రం, లాలాజ‌ల శాంపిళ్ళ‌ను తీసుకున్నారు. ప‌దే ప‌దే కునుకు తీసేవారు, మ‌ధ్యాహ్న స‌మ‌యంలో ఎన్న‌డూ కునుకు తీయ‌ని వారు, మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో చాలా అరుదుగా ప‌డుకునే వారి వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అరుదుగా కునుకు తీసే వారితో పోల్చితే ప‌దే ప‌దే కునుకు తీసే వారికి మద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్లు, నిద్ర‌లేమి, గుర‌క స‌మ‌స్య‌లు ఉన్నాయని తాము గుర్తించిన‌ట్లు తెలిపారు.

మ‌ధ్యాహ్న స‌మ‌యంలో కాసేపు నిద్ర‌పోని వారితో పోల్చితే నిద్ర‌పోయేవారికి ర‌క్త‌పోటు ముప్పు 12 శాతం అధికంగా ఉంటుంద‌ని, స్ట్రోక్ వ‌చ్చే ముప్పు 24 శాతం అధికంగా ఉంటుంద‌ని తేల్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. 60 ఏళ్ళ వ‌య‌సులోపు ఉండి కునుకుతీసే అల‌వాటు ఉన్న వారిలో అధిక ర‌క్త‌పోటు ముప్పు 20 శాతం అధికంగా ఉంటుంద‌ని చెప్పారు. చాలా మంది రాత్రిపూట స‌రిగ్గా నిద్ర‌పోకుండా ఇత‌ర స‌మ‌యాల్లో కునుకు తీస్తున్నార‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. రాత్రి స‌మ‌యంలో స‌రిగ్గా నిద్ర‌పోక‌పోతే ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్పారు. ప‌దేప‌దే కునుకు తీసేవారికి గుండెపోటు, ఇత‌ర స‌మ‌స్య‌ల ముప్పు కూడా ఉంటుంద‌ని తెలిపారు.

Sonia Gandhi: స్మృతీ ఇరానీతో సోనియా.. “నాతో మాట్లాడకు”