Sonia Gandhi: స్మృతీ ఇరానీతో సోనియా.. “నాతో మాట్లాడకు”

కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పిలవడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందుకెళ్లారు. అదే సమయంలో మాట కలిపేందుకు స్మృతీ ఇరానీ ప్రయత్నించగా "నాతో మాట్లాడకు" అని సోనియా చెప్పినట్లు సమాచారం.

Sonia Gandhi: స్మృతీ ఇరానీతో సోనియా.. “నాతో మాట్లాడకు”

 

 

Sonia Gandhi: కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పిలవడంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందుకెళ్లారు. అదే సమయంలో మాట కలిపేందుకు స్మృతీ ఇరానీ ప్రయత్నించగా “నాతో మాట్లాడకు” అని సోనియా చెప్పినట్లు సమాచారం.

లోక్‌సభలో సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరీలకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. “సోనియా గాంధీ వారి సభ్యులతో కలిసి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ద్రౌపది ముర్మును కించపరస్తుండగా సోనియా గాంధీ కూడా దానికి ఒప్పుకున్నారు” అని కేంద్ర మంత్రి ఆరోపించారు.

లోక్‌సభ స్పీకర్ సభను వాయిదా వేసిన తర్వాత.. నినాదాలు చేస్తున్న బీజేపీ ఎంపీల వద్దకు వెళ్లాలనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో ఒకరైన బీజేపీ ఎంపీతో “ఇప్పటికే అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పారు. ఇంకా నన్నెందుకు ఇందులోకి లాగుతున్నారు” అంటూ ప్రశ్నించారు.

Read Also: అధిర్ చౌదురి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతలతో సోనియా అత్యవసర భేటీ

ఆ సంభాషణ జరుగుతుండగానే స్మృతీ ఆరానీ జోక్యం చేసుకుని.. నేను మీకు సాయం చేయొచ్చా అని అడగ్గా.. నాతో మాట్లాడకు అని సోనియా బదులిచ్చారట.