Madhya Pradesh
Bhopal: మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఒకే సిరంజితో 30మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువక ముందే.. మరోసారి వైద్యుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో వైద్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుపూర్ జిల్లాలోని గోదారు గ్రామానికి చెందిన జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ జిల్లా ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో షాడోల్ జిల్లాలోని వైద్య కళాశాలకు తరలించగా చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందింది.
E-Scooter: రాఖీ పండుగకు చెల్లికి స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలని దొంగతనం
జిల్లా ఆసుపత్రి నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తన తల్లి మృతికి మెడికల్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని రోగి కుమారుడు సుందర్ యాదవ్ ఆరోపించారు. మహిళల మృతదేహాన్ని తమ గ్రామానికి తరలించేందుకు ఆస్పత్రి వాహనం ఇవ్వాలని వైద్యులను కోరారు. అయితే వారు తిరస్కరించడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రైవేట్ వాహనదారులు రూ.5వేల వరకు అడగడంతో చేసేదేమీ లేక బైక్ పై తల్లి మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు.
किसी भी राज्य में मंत्रिमंडल क्यों हो,अगर हां तो तस्वीर क्यों नहीं बदलती ये शहडोल का छोटा अस्पताल नहीं मेडिकल कॉलेज हैं बेटे अपनी मां का शव बाइक पर ले जा रहे हैं @ChouhanShivraj इसके बाद भी स्वास्थ्य मंत्री के तर्क हो सकते हैं! आपलोग सिर्फ चुनाव विभाग रखें जो काम साल भर करते हैं pic.twitter.com/NJ9NvoWDsv
— Anurag Dwary (@Anurag_Dwary) August 1, 2022
రూ.100 పెట్టి చెక్క పలకను కొని, దానితో తల్లి మృతదేహాన్ని కట్టి, అనుప్పూర్ జిల్లాలోని తమ గ్రామమైన గుడారుకు 80 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వైద్యుల తీరుపట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.