E-Scooter: రాఖీ పండుగకు చెల్లికి స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలని దొంగతనం

ఢిల్లీ పోలీసులు పలు ఘటనల్లో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా చెప్పిన సమాధానాలకు షాక్ అయ్యారు. రక్షా బంధన్ రోజున తన చెల్లికి ఈ-స్కూటర్ గిఫ్ట్ ఇచ్చేందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు వెల్లడించాడు.

E-Scooter: రాఖీ పండుగకు చెల్లికి స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలని దొంగతనం

Loan Recovery Agents Arrested

 

 

E-Scooter: ఢిల్లీ పోలీసులు పలు ఘటనల్లో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా చెప్పిన సమాధానాలకు షాక్ అయ్యారు. రక్షా బంధన్ రోజున తన చెల్లికి ఈ-స్కూటర్ గిఫ్ట్ ఇచ్చేందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు వెల్లడించాడు.

సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ లో జులై 7న కంప్లైంట్ రావడంతో ఎంక్వైరీ మొదలుపెట్టారు. సురేంద్ర అనే వ్యక్తి దొంగతనం చేయబోయి ఫెయిల్ అయ్యాడు. పారిపోవాలని ప్రయత్నించే క్రమంలో అతని ఫోన్ అక్కడే పడిపోయింది. దాని ఆధారంగా నిందితుడి ఆచూకీ తెలుసుకోగలిగారు.

రోహిణి ప్రాంతంలో ఉండే 21ఏళ్ల తరుణ్.. బైక్ తో పాటు మూడు మొబైల్ ఫోన్స్ దొంగిలించినట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ విహార్ నుంచి కొన్ని వస్తువుల రికవరీ చేశాం. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. రాఖీ గిఫ్ట్ గా తన చెల్లికి టూ వీలర్ ఇవ్వాలనుకున్నాడట.

Read Also : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం

తరుణ్ పట్టుకున్న పోలీసులకు ఆరు కేసుల్లో పరిష్కారం దొరికింది. స్కూల్ కు వెళ్లే సమయంలోనే చదువుమానేసిన వ్యక్తి.. మద్యానికి బానిసగా మారాడు. అతనిపై పది కేసులకు పైగా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.