Samsung Big Alert: శాంసంగ్ కంపెనీ అఫిషియల్ ప్రకటన.. ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే తప్పకుండా ఇది చదవండి..
ఆన్ లైన్ లో తమ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే కస్టమర్లకు శాంసంగ్ ఇచ్చిన హెచ్చరిక ఏంటి? ఆ హెచ్చరిక జారీ చేయడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం..

Samsung Big Alert: మీరు ఆన్ లైన్ లో శాంసంగ్ ఫోన్, యాక్ససరీస్, ట్యాబ్స్ కొనాలని చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి షాపింగ్ సైట్స్ లో కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారా? అయితే.. ఈ న్యూస్ మీ కోసమే. ఆన్ లైన్ కొనుగోళ్లకు సంబంధించి శాంసంగ్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ముఖ్యమైన సూచనలు చేసింది శాంసంగ్.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్ లైన్ సైట్స్ లో మొబైల్స్, యాక్ససరీస్, ట్యాబ్స్ కొనుగోలు చేసే వారికి శామ్‌సంగ్ పలు సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో రీఫర్బిష్డ్, ఫేక్ వస్తువులు కొనకుండా యూజర్లను అలర్ట్ చేసింది. ఏ సెల్లర్ పడితే ఆ సెల్లర్ నుంచి తమ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని శాంసంగ్ కోరింది. తాము సూచించిన సెల్లర్ల నుంచి ప్రొడక్ట్స్ కొనాలని స్పష్టం చేసింది.
అమెజాన్‌లో ఏ సెల్లర్ పడితే ఆ సెల్లర్ నుంచి కాకుండా.. Clicktech Retail, STPL Exclusive, Darshital Etel సెల్లర్స్ నుంచి మాత్రమే కొనాలంది. ఇక ఫ్లిప్‌కార్ట్ విషయానికి వస్తే TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerceలో మాత్రమే తీసుకోవాలంది.
శాంసంగ్ అఫీషియల్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ సెల్లర్స్..
Amazon – Clicktech Retail, STPL Exclusive, Darshital Etel
Flipkart :
మొబైల్స్ – TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerce
గేర్స్ అండ్ యాక్ససరీస్ – Buzz India, SV PeriPherals, Unique Click
ట్యాబ్స్ అండ్ నోట్ పీసీ – India Flash Mart, Retailnet
తాము తెలిపిన సెల్లర్స్ నుంచి కాకుండా అన్ ఆథరైజ్డ్ సెల్లర్ల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తలు రీఫర్బిష్డ్, ప్రీ యూజ్డ్, యాక్టివేటెడ్, కౌంటర్ ఫిట్ కావొచ్చని శాంసంగ్ కంపెనీ హెచ్చరించింది. ఫేక్, ఇది వరకే వాడిన ఉత్పత్తులను కొత్తవిగా చెప్పి అమ్మే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ప్రొడక్ట్స్ కు సర్వీస్ లిమిటెడ్ గా ఉంటుందని శాంసంగ్ కంపెనీ తెలిపింది. సో, బీకేర్ ఫుల్. ఆన్ లైన్ లో శాంసంగ్ ఉత్పత్తులు కొనాలి అనుకునే వారు.. కంపెనీ అధికారికంగా ప్రకటించిన సెల్లర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయడం చాలా మంచిది.
Also Read: మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది.. ఎంత హాయిగా ప్రయాణించొచ్చంటే..?