Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం

దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే బ్యాంకులో చోరీ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నుంచి ఆరుగురు దొంగలు..

Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం

Bank Robbery

Bussapur Bank Robbery : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆర్మూరు ఏసీపీ ప్రభాకర్ రావు నేతృత్వంలో నాలుగు పోలీసు బృందాలు చోరీ కేసుని దర్యాఫ్తు చేస్తున్నాయి. చోరీ జరిగిన బ్యాంకులో ఇప్పటికే ఫింగర్ ప్రింట్లు, ఆధారాలు సేకరించాయి క్లూస్ టీమ్స్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దొంగలు వాడిన ఫేస్ మాస్కులు, గ్లౌవ్స్ సీజ్ చేసిన పోలీసులు..వాటిని ఎక్కడ కొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. డాగ్ స్వ్కాడ్ కదలికల ఆధారంగా దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. హైవే పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠానే బ్యాంకులో చోరీ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నుంచి ఆరుగురు దొంగలు వచ్చి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ నాగరాజు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు.

Bank Robbery : జులాయి సినిమా తరహాలోనే.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులో భారీ చోరీ

బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ తెలిపారు. పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి దొంగల కోసం గాలిస్తున్నాయని స్థానిక సీఐ చెప్పారు.

Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. జులాయి సినిమాలో బ్యాంకు దోపిడీ సీన్ తరహాలో దొంగలు బ్యాంకుకి కన్నమేశారు. గ్యాస్ కట్టర్ తో షట్టర్ కట్ చేసిన దొంగలు.. అదే గ్యాస్ కట్టర్ తో లాకర్ ను కూడా కట్ చేశారు. దొంగలు 4 కోట్ల రూపాయల విలువ చేసే 8.3 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే ఏడున్నర లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ తో లాకర్ ను కట్ చేసే క్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఏడున్నర లక్షల నగదు కాలిబూడిదైంది.

నిజామాబాద్ జిల్లా 44వ జాతీయ రహదారిపై మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు లాకర్‌ను ధ్వంసం చేసిన దొంగలు రూ.4.46 కోట్ల విలువైన సొమ్ము దోచుకెళ్లారు. గ్రామాభివృద్ధి కమిటీ భవనంపై అంతస్తులో ఉన్న బ్యాంకు తాళాలు తొలగించి దొంగలులోనికి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్లతో కట్టర్లను వినియోగించి స్ట్రాంగ్‌రూం తాళాలు తొలగించారు. బ్యాంకులో రెండు లాకర్లుండగా తాకట్టు బంగారం ఉంచిన పెద్ద లాకర్‌ను ధ్వంసం చేశారు.

ఇందులో రూ.7.30 లక్షల నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలు, ఫైల్స్ ఉన్నాయి. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ తలుపును కోసే క్రమంలో నిప్పురవ్వల కారణంగా కొంత నగదు, ఫైల్స్ కాలి బూడదయ్యాయి. దొంగలు వెంటతెచ్చిన గ్యాస్‌ సిలెండర్లు అక్కడే వదిలేసి బంగారంతో పరారయ్యారు. దొంగలు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి వీడియో రికార్డు జరిగే డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. ఎలుగుబంటి రూపంలో ఉండే మాస్కులు ధరించి వచ్చిన దొంగలు బ్యాంకు ఆవరణలో ఓ మాస్క్‌ వదిలి వెళ్లారు. ఖాతాదారుల ఆభరణాల లాకర్‌కు ఏమీ కాకపోవటంతో మరింత భారీ చోరీ తప్పినట్లయింది.

దోపిడీ శనివారం అర్ధరాత్రే జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆదివారం ఉదయమే బ్యాంకు కింద ఉండే హోటల్‌కు వచ్చిన కొందరు కాలిన వాసన గుర్తించినప్పటికీ అటువైపు వెళ్లలేదు. ఆదివారం బ్యాంకుకి సెలవు కావడంతో ఉద్యోగులెవరూ రాలేదు. సోమవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది బ్యాంకులో పరిస్థితిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు బ్యాంకు భవనానికి ముందు నుంచి కాకుండా వెనకాల ఉన్న పాఠశాల, బీఎస్‌ఎన్‌ఎల్‌ పాత ఎక్స్ చేంజ్ గోడలు దూకి వచ్చినట్లు తేలింది.