Balakrishna: బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. ఆ ఘనత దక్కిచుకున్న తొలి సౌత్ హీరోగా రికార్డ్
ముంబయి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బెల్‌ను మోగించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు (Balakrishna)నందమూరి బాలకృష్ణ.

Balakrishna creates record as first South actor to ring NSE bell
Balakrishna: నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ముంబయి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను మోగించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. ముంబయిలోని ఎన్‌ఎస్‌ఈని సందర్శించాల్సిందిగా బాలకృష్ణకు ఇటీవల ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు ఎన్‌ఎస్‌ఈకి వెళ్లిన బాలకృష్ణ అధికారుల విజ్ఞప్తి మేరకు యెన్ఎస్సి గంట (NSE Bell)ను మోగించారు. దాంతో ఈ బెల్ మోగించిన మొదటి దక్షిణాది హీరోగా అరుదైన ఘనతను సాధించారు(Balakrishna) బాలకృష్ణ.
Teja Sajja: చిరంజీవి సెలెక్ట్ చేసిన ఆ ఒక్క ఫోటో నా జీవితాన్నే మార్చేసింది: తేజ సజ్జ
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీని కాంబోలో “అఖండ 2: తాండవం” సినిమా చేస్తున్నాడు. భారీ విజయాన్ని సాధించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.