సీఎంలతో మోడీ భేటీ.. వ్యాక్సిన్ పంపిణీపై ఫోకస్

Modi meet with CM’s: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్ లో పాల్గొననున్నారు. జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై డిటైల్‌గా చర్చించనున్నారు. కరోనా టీకా సప్లై విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రధాని మోడీ సీఎంలతో భేటీ అవుతుండటం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్‌ సన్నద్ధతలో భాగంగా గవర్నమెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 దఫాలుగా డ్రై రన్‌ నిర్వహించింది.

కరోనా వ్యాక్సినేషన్‌ పంపిణీ చేసేందుకు ప్రజలకు అందించేందుకు గవర్నమెంట్ దాదాపు అన్ని ఏర్పాట్లు చేసింది. సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. తొలి డోసును కోటి మంది హెల్త్ వర్కర్లకు, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఇస్తామని హామీ ప్రకటించింది. కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది.

రెండో దఫాలో కరోనా వైరస్ తో బాధపడుతున్న వారికి, 50ఏళ్ల పైబడ్డ వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.