Pooja Hegde : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో పూజా పాప క్యారెక్టర్ ఇదేనంటగా..

పూజా హెగ్డే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఏంటనేది లీక్ చేసేసింది.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో తాను స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నాని చెప్పింది..

Pooja Hegde Doing A Stand Up Comedian Role In Most Eligible Bachelor

Pooja Hegde: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ మూవీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే జూన్ 19న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేసుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో సీన్ రివర్స్ అయింది..

ఇదిలా ఉంటే రీసెంట్‌గా పూజా హెగ్డే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఏంటనేది లీక్ చేసేసింది.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో తాను స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నాని చెప్పింది.. మైక్ ముందు గంటల తరబడి నిలబడి అంతమందిని నవ్వించడం అనేది చిన్న విషయం కాదని, ఈ క్యారెక్టర్ కోసం తాను ఎంతో హోమ్ వర్క్ చేశానని, విభా అనే ఛాలెంజింగ్ రోల్ ఎంత బాగా చేశాననేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారని అంది పూజా పాప..