lockdown రూల్స్ బ్రేక్ చేసిందని Poonam Pandeyపై కేసు

  • Publish Date - May 12, 2020 / 11:13 AM IST

మోడల్-నటి అయిన పూనమ్ పాండేపై ఆదివారం ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్‌ను అతిక్రమించినందుకు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు మెరైన్ డ్రైవ్ పోలీసులు తెలిపారు. 

తన కాస్ట్లీ కారు తీసుకుని మెరైన్ డ్రైవ్ వద్ద కారణం లేకుండా చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గ్రహించారు. ‘పూనమ్ పాండేతో పాటు శామ్ అహ్మద్ బాంబే(46)పై కేసు ఫైల్ చేశాం. సెక్షన్ 269(ప్రాణాంతక ఇన్ఫెక్షన్ వ్యాప్తి సమయంలో నిర్లక్ష్యం వహించడం), సెక్షన్ 188(పబ్లిక్ సర్వెంట్ మాట ధిక్కరించడం)కేసుల్లో ఆమెపై కేసులు ఫైల్ అయ్యాయి. 

నేషనల్ డిజాస్టర్ యాక్ట్ కింద ఆమెపై కేసులు బుక్ అయినట్లు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృత్యుంజయ హీరేమత్ తెలిపారు. 

Read Here>> భర్తతో కలిసి సాహ‌స‌యాత్ర‌కు సమంత!