Prabhas Radhe Shyam Movie Shooting Updates
Radhe Shyam: ఎంత లాగినా… ఇంకా మిగిలే ఉంటోంది. హమ్మయ్యా ఇంతటితో షూటింగ్ అయిపోయిందనుకునే లోపే మళ్లీ కొత్త షూట్ మొదలువుతుంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విషయంలో ఇదే జరుగుతోంది. నిన్న కాక మొన్న వారం షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్న మేకర్స్… ఇప్పుడు మాట మార్చుతామంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ప్రభాస్ – పూజా హెగ్డేలను సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు..
‘రాధే శ్యామ్’ షూట్ కెళ్లి మూడున్నర సంవత్సరాలు పైగానే గడుస్తోంది. కానీ చూస్తోంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్‌లా కనిపిస్తోంది. జూలై 30న ఈ మూవీ థియేటర్స్‌కి రాబోతుందని ప్రకటించారు. అందుకు తగ్గట్టే మరో వారం ప్యాచ్ వర్క్‌తో సినిమా కంప్లీటైపోయినట్టేనని రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభాస్ – పూజాహెగ్డేలపై డ్యూయెట్ షూట్ చేయాలని థింక్ చేస్తున్నారు మేకర్స్..
నిజానికి డ్యూయెట్ ప్రపోజల్ మొదటి నుంచి ఉంది. కానీ, కరోనా కారణంగా ఎన్నోసార్లు వాయిదాపడిన ‘రాధే శ్యామ్’ మెయిన్ కంటెంట్ మొత్తాన్ని ఎలాగోలా కంప్లీట్ చేశారు. కొన్ని సీన్స్‌ను రీషూట్ చేశారు. అయితే ప్రభాస్ – పూజాహెగ్డేలపై ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. కానీ ఈ సెకండ్ వేవ్ పరిస్థితుల్లో డ్యూయెట్ లేకుండానే సినిమాను పూర్తి చేద్దామనే ప్రపోజల్ తెచ్చారు ప్రభాస్. దానికి డైరెక్టర్ రాధాకృష్ణ కూడా ఓకే చెప్పారు. అయితే యూరప్ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆ డ్యూయెట్ కావాల్సిందేనని ఫోర్స్ చేస్తోంది టీ సిరీస్ హౌజ్.
‘రాధే శ్యామ్’ హిందీ రైట్స్ 120కోట్ల రూపాయలకు దక్కించుకుంది టీ సిరీస్. అందుకే రిమైనింగ్ సాంగ్ కూడా తెరకెక్కించమని యూనిట్‌ను రిక్వెస్ట్ చేస్తోంది. ప్రేక్షకుల్లో టీ సిరీస్ కున్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకొని.. సినిమాను ప్రమోట్ చేయాలంటే ఈ డ్యూయెట్ కీలకమని నమ్ముతోందీ ప్రొడక్షన్ హౌజ్. అందుకే ప్రభాస్ – పూజాహెగ్డేలను మళ్లీ ఒకే లోకేషన్‌కు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. రాబోయే నెలల్లో షూటింగ్స్ స్టార్టయితే ఈ డ్యూయెట్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. చూస్తుంటే థియేటర్స్ తెరుచుకున్నా జూలై ‘రాధే శ్యామ్’ వచ్చేలా కనిపించడం లేదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..