భారీగా తగ్గిన LPG రేట్లు.. సబ్సిడీ లేని సిలిండర్ రూ.581.50 మాత్రమే

  • Publish Date - May 1, 2020 / 10:42 AM IST

సబ్సిడీ లేని LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా తగ్గింపులు వచ్చాయి. ఒక్కో సిలిండర్ పై రూ.160 తగ్గిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను (LPG Cylinder Price Cut) మళ్లీ భారీగా తగ్గించాయి. కొత్త ధరలను మే1నుంచే అమల్లోకి తీసుకురానున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ డిమాండ్ తగ్గడంతో గ్యాస్ ధరల్లోనూ మార్పులు వచ్చాయి. న్యూఢిల్లీలో ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర రూ. 744 నుంచి తగ్గి రూ. 581.50 గా వుంటుంది. ఇక్కడ దాదాపు 162 రూపాయలు తగ్గింది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. 

హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 207 త‌గ్గి రూ. 589.50 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధ‌ర రూ. 988 కి చేరింది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రలు మారుతూ వుంటాయి. గత ఆగస్టు నుంచి పెరుగుతున్న గ్యాస్ రేట్లు ఒక్కసారిగా తగ్గాయి. 

భారతదేశపు అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్ప్ లిమిటెడ్ (IOC) ఏప్రిల్‌లో అమ్మకాలు 20% పెరిగాయని తెలిపింది. ప్రభుత్వం ప్రతి ఇంటికి సంవత్సరానికి 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ రేటుకు లభిస్తాయి. సిలిండర్ల సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలకు ట్రాన్సఫర్ అవుతుంది. 

Also Read | మే 4 నుంచి షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్ ఓపెన్