Adhigaaram : వెట్రి మారన్ కాంబోలో.. లారెన్స్ ‘అధికారమ్’..

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ‘అధికారమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు..

Raghava Lawrence New Movie Titled As Adhigaaram

Adhigaaram: ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కొద్దికాలంగా హీరోగా నటిస్తూ, తన దర్శకత్వంలో ‘ముని’ సీక్వెల్స్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు లారెన్స్.. ‘కాంచన 3’ తర్వాత వేరే డైరెక్టర్లతో కలిసి పనిచెయ్యబోతున్నారు.

‘ఆడుకలం’,‘విశారణై’, ‘వడచెన్నై’, ‘అసురన్’ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సినిమాకు కథనందించారు. దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల మీద వెట్రిమారన్, కదిరేసన్ కలిసి నిర్మిస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ‘అధికారమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్తంతో తడిచిన దుస్తుల్లో చేతిలో కత్తి పట్టుకుని నడుస్తున్న లారెన్స్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సెకండ్ లుక్‌లో లారెన్స్ మురుగేసన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో ‘అధికారమ్’ సెట్స్ మీదకెళ్తుంది.