Rajasthan BJP MP alleges attacked by mining mafia
BJP MP attacked by mining: తన కారుపై మైనింగ్ మాఫియా దాడికి దిగిందని రాజస్తాన్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ రంజీత కోలి సోమవారం ఆరోపించారు. వాస్తవానికి తనపై హత్యాయత్నమే జరిగిందని, కానీ తృటిలో తప్పించుకున్నానని ఆమె చెప్పారు. ఈ విషయమై తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కోలి మాట్లాడుతూ ‘‘150 ట్రక్కులు ఓవర్‌లోడ్‌తో వెళ్తుండడాన్ని చూశాను. వారిని నేను ఆపాలని ప్రయత్నించారు. అంతే వారు నాపై దాడికి దిగారు. నా కారుపై రాళ్లు విసిరారు. నన్ను చంపాలని ప్రయత్నించారు. అయినప్పటికీ నేను వారికి భయపడలేదు’’ అని అన్నారు.
తనపై దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు వాళ్లు పట్టించుకోలేదని, ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ నిరసన సందర్భంగా కోలి అన్నారు. అయితే ఈ విషయమై ఎంపీ కోలిని సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ రంజన్ తెలిపారు. ‘‘ఓవర్‌లోడ్ ట్రక్కుల వారు తనపై రాళ్లతో దాడికి దిగారని ఆమె ఆరోపించారు. మేము నిరసన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు చేయాలని కోరాము. ఆమె అందుకు అంగీకరించారు. అయితే దీనిపై సమీపంలోని పోలీసుల నుంచి వెంటనే స్పందన రాలేదని, దీన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు’’ అని మెజిస్ట్రేట్ అన్నారు.
కాగా, ఎంపీపై దాడిని కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ ఖండించారు. ‘‘రాజస్తాన్‌లో చట్టబద్ధ పాలన సాగడం లేదు. మైనింగ్ మాఫియానే రాష్ట్రాన్ని పాలిస్తోంది. ఒక ఎంపీపై పట్టపగలే దాడికి దిగారంటే రాష్ట్రంలో వారి ఆధిపత్యం, ప్రభుత్వ వ్యవస్థల బలహీనత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదేమీ మొదటిసారి కాదు. రాజస్తాన్‌లో శాంతిభద్రతలు అనేవి చట్ట పరిధిలో లేనే లేవు. ప్రతిరోజు మహిళలు, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి’’ అని మేఘవాల్ అన్నారు.
BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!