కరోనా కారణంగా రజినీ కాంత్ సినిమా షూటింగ్ వాయిదా..
- sekhar
- Published On : December 23, 2020 / 04:15 PM IST
Annaatthe shoot suspended: సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన టీం షూటింగ్ ఆపేశారు.
రాజకీయ రంగ ప్రవేశం దృష్ట్యా 2021 జనవరి 12 నాటికి సినిమాను పూర్తి చేసేయాలని రోజుకి 12 గంటలకు పైగా పని చేస్తున్నారు రజినీ.. పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ దగ్గరుండి రజినీ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు కరోనాతో షూటింగ్ మరింత ఆలస్యం అవడంతో రజినీ అభిమానులు మరియు చిత్ర బృందంలో ఆందోళన నెలకొంది.
ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా 40 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. డి.ఇమాన్ సంగీతమందిస్తున్నారు. వెట్రి సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
