Ram Charan – Upasana
Ram Charan – Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహ వార్షికోత్సవం నేడు (జూన్ 14).. 2012 జూన్ 12న చరణ్, ఉపాసనల పెళ్లి జరిగింది..
ఇది వారి 9వ వెడ్డింగ్ యానివర్శరీ. రామ్ చరణ్, ఉపాసన కొంతకాలం ప్రేమాయణం తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
రామ్ చరణ్, మెగాస్టార్ వారసత్వాని కొనసాగిస్తూ.. తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఉపాసన యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా, అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అలాగే అపోలో తరపున ఆమె పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
చరణ్ – ఉపాసనల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెగాభిమానులు, సినీ వర్గాలవారు విషెస్ తెలియజేస్తున్నారు. చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాల్లో నటిస్తున్నారు.