Ram Charan Fan : అభిమాన హీరోని కలిసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన రామ్ చరణ్ ఫ్యాన్..

అభిమాని కళ్లల్లో ఆనందం చూసి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చాలా సంతోషించారు. తనకిష్టమైన కథానాయకుణ్ణి కలవాలనే కోరిక నెరవేరడంతో చరణ్ ఫ్యాన్ భావోద్వేగానికి గురయ్యారు.

Ram Charan Gets Birthday Gift From His Fan1

Ram Charan Fan : అభిమాని కళ్లల్లో ఆనందం చూసి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చాలా సంతోషించారు. తనకిష్టమైన కథానాయకుణ్ణి కలవాలనే కోరిక నెరవేరడంతో చరణ్ ఫ్యాన్ భావోద్వేగానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీమతి సుదర్శన్ బొడ్డు, రామ్ చరణ్‌కు చాలా పెద్ద ఫ్యాన్.. తన అభిమాన హీరో కోసం ఆమె కొబ్బరిపుల్లలతో అద్భుతమైన ఇంటిని తయారుచేశారు. దీనిని కలిసి రామ్ చరణ్‌కి అందించాలనుకుంటున్నట్టు, ఇంటిని తయారు చేస్తున్న వీడియోతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె.

అంత పెద్దావిడ తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ఆశ్చర్యపోయిన చెర్రీ తాజాగా శ్రీమతిని కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి బహుమతిని ఇచ్చినందుకు చరణ్ ఆమెకు థ్యాంక్స్ తెలిపారు. శ్రీమతి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫొటోలు ఇచ్చారు రామ్ చరణ్. తన కోరిక నిజమవడంతో శ్రీమతి భావోద్వేగానికి గురవగా మెగా పవర్‌స్టార్ ఆమెను ఓదార్చారు.