రామ్ చరణ్ సన్‌గ్లాసెస్ ఖరీదు ఎంతో తెలుసా!

Ram Charan: మెగా పవర్‌స్టార్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. చెర్రీ ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. చరణ్ సన్‌గ్లాసెస్ పెట్టుకున్న ఇమేజ్, బర్డ్‌తో సరదాగా గడుపుతున్న పిక్స్ అవి.

చరణ్ ధరించిన సన్‌గ్లాసెస్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 40, 464 అంట.. సెలబ్రిటీస్ పెట్టుకునే అత్యంత స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గ్లాసెస్ ఇవి. ఇటీవల కోవిడ్ బారినపడ్డ చెర్రీ తాజాగా కోలుకున్నారు.

హీ ఈజ్ బ్యాక్.. ఫైనల్లీ టెస్టెడ్ నెగెటివ్.. అంటూ చెర్రీ బర్డ్‌తో తీసుకున్న పిక్స్ దర్శనమిచ్చాయి. రామ్ చరణ్ ప్రస్తుతం తారక్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయనున్నారు.