మెగాస్టార్ టైటిల్‌తో పవర్‌స్టార్ సినిమా..

Billa Ranga: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా.. మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
సోమవారం పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సినిమాలో పవన్, బిజూ మీనన్ క్యారెక్టర్ చేస్తుండగా.. రానా, పృథ్వీ రాజ్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ పేరు ఫిక్స్ చేశారట.

1982లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ క్లాసిక్ మూవీ అప్ప‌ట్లో పెద్ద హిట్ అయ్యింది. కాన్సెప్ట్‌కు తగ్గట్లు ఈ మూవీకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని, బిల్లాగా పవన్, రంగానా రానా కనిపించనున్నారని టాక్ న‌డుస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన పవన్ వీడియోలో ‘బిల్లా.. రంగా’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తోంది. దీంతో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌కి ఈ పేరే ఫిక్స్ చేశారని సమాచారం.

ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2021 జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది. సమర్పణ : పిడివి ప్రసాద్, సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ.