Rana
Rana Daggubati : నటుడు దగ్గుబాటి రానా ఇవాళ(సెప్టెంబర్ 8, 2021) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘన, డ్రగ్ పెడ్లర్లతో జరిపిన లావాదేవీలపై రానాను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ముగ్గురు సభ్యుల బృందం.. రానాను కీలక అంశాలపై ప్రశ్నించి వివరాలు తెల్సుకున్నారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ను కూడా విచారణకు పిలిచి అతడి సమక్షంలోనే విచారణ జరిపారు అధికారులు.
Tollywood Drugs : దుబాయ్ దావత్ లో ఏం జరిగింది? : కెల్విన్ సమక్షంలో రానా ఇంటరాగేషన్
దాదాపు 7 గంటల పాటు… రానా దగ్గుబాటిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అధికారులు కోరిన డాక్యుమెంట్లు సమర్పించారు. రానా ఈడీ ఆఫీస్ కు వస్తున్నటైంలో… పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. వెళ్లే సమయంలోనూ పోలీసులు అంతే కట్టుదిట్టంగా వ్యవహరించారు. కేసుకు సంబంధించిన మీడియా అడిగిన ప్రశ్నలకు రానా బదులివ్వలేదు. ఓ రిపోర్టర్ చేతి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. తనను సెల్ ఫోన్ తో వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ ను వెళ్లిపో … వెళ్లిపో… అంటూ కారులో నుంచే మందలించారు.
Tollywood Drugs Case : సినీ తారల సీక్రెట్స్ చెప్పేసిన కెల్విన్.. ఇక స్టార్స్‌కు చిక్కులే..
ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో రానా ఇంటరాగేషన్ కు అటెండయ్యారు. 2015-17 లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను రానా ఈడీకి సమర్పించారు. రెండు బ్యాంకు అకౌంట్లకు సంబంధించి సమాచారాన్ని రానా ఇచ్చినట్టు తెలుస్తోంది. రానా బ్యాంకు అకౌంట్లు, జరిగిన లావాదేవీలను పరిశీలించింది ఈడీ బృందం. రానా అకౌంట్ నుంచి కొన్ని అనుమానిత ఆర్థిక లావాదేవీలు జరిగాయని… వాటి విషయంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులకు ఈ రెండు ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బులు వెళ్లాయని ఈడీ భావిస్తోంది. దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది.