Viraata Parvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డిసెంబర్ 14 రానా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ‘విరాట పర్వం’ లో రానా కామ్రేడ్ రవి అన్న క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఏకే 47 పట్టుకుని ఠీవీగా నడుస్తున్న రానా లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో రానా కంటే ముందు సాయి పల్లవి పేరు వేయడం విశేషం. ప్రస్తుతం ‘విరాట పర్వం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.