Dr. రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న.. ‘విరాట పర్వం’ ఫస్ట్ గ్లింప్స్..

  • Publish Date - December 14, 2020 / 12:12 PM IST

Rana Daggubati: భల్లాలదేవ రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం.. ‘విరాట పర్వం’.. యదార్థ సంఘటనల ఆధారంగా 1990 కాలం నాటి నక్సలిజం నేపథ్యంలో.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

సాయి పల్లవి కథానాయిక.. ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 14 రానా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫస్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

‘‘ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..
సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది..
Dr. రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న’’.. అనే టెక్స్ట్‌తో‌ పాటు ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం’ వంటి డైలాగులతో క్లుప్తంగా సినిమా నేపథ్యం ఏంటనేది చూపించారు. రానా గెటప్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. దివాకర్ మణి విజువల్స్ కూడా బాగున్నాయి.