రానా – పవన్ సినిమా ప్రారంభం..

  • Published On : December 21, 2020 / 12:24 PM IST

Rana – Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా.. మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం : 12 గా ఈ సినిమాను రూపొందిస్తుంది.

సోమవారం పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ నిచ్చారు. త్రివిక్రమ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. ప్రముఖ నిర్మాత రాధా కృష్ణ (చినబాబు) దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.

ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2021 జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది. సమర్పణ : పిడివి ప్రసాద్, సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ.