Raviteja’s Krack: మాస్ మహారాజా మాంచి స్పీడుమీదున్నారు. ఆ మధ్య కాస్త డల్ అయిన రవితేజ.. ఇప్పుడు ఫుల్‌ఫామ్‌లోకి వచ్చారు. తనతో రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ టైటిల్‌తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఫుల్‌గా పెరిగిపోయాయి..
రవితేజ.. గోపీచంద్ మలినేని ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ‘డాన్ శీను’ ద్వారా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు.. బెంగాలీ మూవీ ‘బాద్‌షా ద డాన్’ సినిమాకి రీమేక్‌గా వచ్చిన ‘డాన్ శీను’ మూవీ రవితేజకు హిట్ ఇవ్వకపోయినా.. గోపీచంద్ పొటెన్షియాలిటీని టాలీవుడ్‌కి చూపించింది.
2013 లో రెండోసారి రవితేజతో ‘బలుపు’ సినిమా చేశారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ సారి కూడా బెంగాలీ మూవీ ‘హీరోగిరీ’ సినిమాని తెలుగులో ‘బలుపు’ గా రీమేక్ చేశారు. శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా వచ్చిన ఈ హైలీ ఎనర్జిటిక్ యాక్షన్ మూవీతో రవితేజ మార్క్ కామెడీతో వచ్చిన ఈ సినిమా కూడా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.
అందుకే ఈ సారి సొంత కథతో, స్ట్రెయిట్ మూవీతో హ్యాట్రిక్‌ని సూపర్ హిట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ఈ జోడీ. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా సక్సెస్ మీట్‌లో కలుద్దామంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పారు హీరో, డైరెక్టర్.. ఫుల్‌గా అటు మాస్, క్లాస్ కాంబినేషన్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి వస్తున్న ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న బ్రహ్మాండంగా విడుదల కానుంది.