రెబల్ స్టార్‌తో యంగ్ రెబల్ స్టార్!

Krishnam Raju: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. గోపికృష్ణా మూవీస్ ప్రై.లి. ‘రెబల్ స్టార్’ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మస్తున్నాయి. కృష్ణం రాజు కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘రాధే శ్యామ్’ లో పరమహంస అనే క్యారెక్టర్లో కనిపించనున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇంతకుముందు ‘బిల్లా’, ‘రెబల్’ సినిమాల్లో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించారు. ‘రాధే శ్యామ్’ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూడో చిత్రం.

https://10tv.in/radhe-shyam-movie-glimpse/

ఈ సినిమా షూటింగ్ అప్పుడు పెదనాన్నతో కలిసి ప్రభాస్ తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఒకేలా స్టైల్‌గా ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

రోమ్ బ్యాక్ డ్రాప్‌లో రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 30న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.