RRR Tamil Rights : రికార్డ్ రేటుకి ‘ఆర్ఆర్ఆర్’ తమిళ్ రైట్స్.. మెగా – నందమూరి అభిమానుల హంగామా..
- sekhar
- Published On : February 17, 2021 / 07:28 PM IST
RRR Tamil Rights: రోజురోజుకీ తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదుగుతోంది. ‘బాహుబలి’ నుండి మొదలైన పాన్ ఇండియా హవా కొనసాగుతోంది. తెలుగు సినిమా సత్తాని ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గరినుండి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది మూవీ టీమ్.
అయితే ఈసారి ఈ సినిమా తమిళ హక్కులు సొంత చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు తాము హక్కులను దక్కించుకున్నామని అధికారికంగా ప్రకటించారు.
ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ తమిళనాడు థియేట్రికల్ హక్కులను పొందామని చెప్పడానికి సంతోషిస్తున్నాం అంటూ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
కాగా, తమిళ్ రైట్స్ రూ. 42 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ‘బాహుబలి 2’ తమిళ హక్కులు రూ. 37 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు వినిపిస్తోన్న లెక్కలను బట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రభంజనం స్టార్ట్ అయినట్లెనంటూ మెగా-నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో హల్‌చల్ చేస్తున్నారు.
We are delighted and proud to announce?
The Tamil Nadu theatrical rights of THE BIGGEST PAN INDIA FILM #RRRMovie is acquired by us…??@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @thondankani @RRRMovie @DVVMovies #RRR pic.twitter.com/ASZsLLVdNT— Lyca Productions (@LycaProductions) February 17, 2021
