హీరో సచిన్ జోషి అరెస్ట్..
- sekhar
- Published On : February 15, 2021 / 04:51 PM IST
Sachin Joshi: బాలీవుడ్ బిజినెస్ మెన్ కమ్ యాక్టర్, ప్రొడ్యూసర్ సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో 18 గంటల పాటు విచారణ చేసిన ఈడీ అధికారులు సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో గోవాలో వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన కింగ్‌ఫిషర్ విల్లాను సచిన్ జోషి కొన్నాడు. ఈ వ్యవహారంలో ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లలో ఒకడిగా ఉన్న సచిన్ దాదాపు రూ. 100 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.
ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాల్సిందిగా సచిన్‌కు ఈడీ అధికారులు గతంలోనే నోటీసులు పంపారు. అయినా సచిన్ విచారణకు హాజరు కాలేదు. గుట్కా అక్రమ రవాణా కేసులో సచిన్ హస్తమున్నట్టు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు గతేడాది సచిన్ జోషిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
