Sandalwood Drug Case: నటి సంజనకు షరతులతో కూడిన బెయిల్..

  • Publish Date - December 11, 2020 / 06:07 PM IST

Sanjjanaa Galrani gets bail: డ్రగ్స్ కేసు.. కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజన గల్రాని అరెస్టు అయ్యారు. న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించింది.



రకరకాల కారణాలతో బెయిల్ కోసం ప్రయత్నించినా న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. తాజాగా ఆరోగ్యపరమైన సమస్యలు చూపిస్తూ.. ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని పై షరతులతో బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించింది.


డ్రగ్స్‌ కేసులో దాదాపు 3 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంజనకు కొన్ని షరతులు విధిస్తూ.. కర్ణాటక హైకోర్ట్ బెయిల్‌కు అంగీకరించింది. రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుని సమర్పించాలని, కేసులో ఎప్పుడంటే అప్పుడు పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని, అలాగే నెలలో రెండు రోజులు కోర్టుకు హాజరై సంతకం చేయాలని షరతులు విధిస్తూ.. సంజనకు హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది..

 



ట్రెండింగ్ వార్తలు