Saradaga Kasepaina Lyrical Song From Paagal
Saradaga Kasepaina: ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, యూత్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా ‘పాగల్’.. నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు.
నువ్వేంట్రా.. నా లవర్‌ని సినిమాకి రమ్మంటున్నావంటా..
‘చిత్ర లహరి’, ‘రెడ్’, ‘అల..వైకుంఠపురములో’.. సినిమాలతో ఆకట్టుకున్న నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం ‘పాగల్’ నుండి ‘సరదాగా కాసేపైనా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
రధన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా అనంత శ్రీరామ్ అందమైన పదాలు రాశారు. కార్తీక్, పూర్ణిమా చాలా చక్కగా పాడారు.. ‘‘సరదాగా కాసేపైనా, సరిజోడై నీతో ఉన్నా.. సరిపోదా నాకీ జన్మకీ.. చిరునవ్వే ఓ సారైనా, చిగురించా లోకంలోనా.. ఇది చాల్లే ఇపుడీ కొమ్మకీ’’.. అంటూ సాగే ఈ కూల్ మెలోడి విశేషంగా ఆకట్టుకుంటోంది. మే 1న ‘పాగల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.