Savithri Films
Savithri Films: సీనియర్ నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా రామ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సావిత్రి ఫిలిమ్స్ బ్యానర్‌పై నంబిరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనూష రెడ్డి కథానాయిక.
జయ నాయుడు, బద్రి, తేజశ్విని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘బాహుబలి, ఏంజెల్’ సినిమాలకు పనిచేసిన పళనిస్వామి, ‘తిరుట్టు కళ్యాణం’ చిత్రానికి పనిచేసిన శక్తివేల్ కో డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.