Selfie craze : సెల్ఫీ మోజు..ఆమె ప్రాణాలు తీసింది
సోఫియా చెయంగ్ ఇన్ స్ట్రాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రకృతి అందాలు వీక్షించటమంటే ఆమెకు భలే సరదా.. అలాగే జలాపాతాలన్నా ఆమెకు ఎంతో ఇష్టం.

ప్రాణాలు తీసిన సెల్ఫీ క్రేజ్
Selfie craze : చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలతో యువత సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. సెల్ఫీల క్రేజీ ఎంతలా ఉందంటే సాహసోపేతమైన ప్రదేశాల్లో సైతం సెల్ఫీలు దిగుతూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అంతా సవ్యంగా ఉంటే పర్వాలేదు. సాహసం ఒక్కోసారి బెడిసికొడితే చివరకు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. నిత్యం ఇలాంటివి ప్రపంచంలో చాలా చోట్ల వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హంకాంగ్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ ఇన్ ప్లుయోన్సర్ సోఫియా చెయంగ్ ఓ వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీదిగే ప్రయత్నం చేస్తూ 16 అడుగుల ఎత్తునుండి క్రింద పడి ప్రాణాలు కోల్పోయింది.
సోఫియా చెయంగ్ ఇన్ స్ట్రాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రకృతి అందాలు వీక్షించటమంటే ఆమెకు భలే సరదా.. అలాగే జలాపాతాలన్నా ఆమెకు ఎంతో ఇష్టం. వారాంతాలలో సుదురా ప్రాంతాలకు ప్రయాణించి ప్రకృతి అందాల మధ్య సమయం గడపటం ఆమెకు అలవాటు. తాను వెళ్ళిన ప్రతిచోట అక్కడి అందాలను సెల్ఫీల్లో బంధించి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. ఆమె పోస్టులకు వీక్షకుల నుండి మంచి స్పందన కూడా వస్తుండేది.
ఈ క్రమంలోనే హంకాంగ్ లోని హాపాక్ లై పార్క్ కు అక్కడున్న వాటర్ ఫాల్ అందాలు వీక్షించేందుకు తన స్నేహితులతో కలసి వెళ్ళింది. సాధారణంగా సోఫియాకు కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు దిగటం భలే సరదా…అలాంటి ఫోటోలనే తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి మంచి పాపులారిటీ సంపాదించింది.
అదే తరహాలో వాటర్ ఫోల్స్ లో వాటర్ ఫాల్స్ వద్ద నున్న ఓ గుట్ట పై నుండి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. అయితే కాలు జారి 16 అడుగుల ఎత్తు నుండి ప్రమాదవశాత్తు క్రిందపడిపోయింది. తీవ్ర గాయాలవ్వటంతో ఆమె స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఆఖరిపోస్టుగా అభిమానులందరికీ అహ్లాదకరమైన వారాంతం ఉండాలంటే పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.