IFFI లో ప్రదర్శించనున్న తెలుగు సినిమా ‘గతం’

Gatham: 51వ అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనకి భారత్ నుంచి హిందీ, ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లో 23 సినిమాలు, 20 లఘ చిత్రాలు ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. తెలుగు నుంచి ‘గతం’ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది.

భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా.. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు.

థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘గతం’ సినిమాను విదేశాల్లో చిత్రీకరించారు. నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI)లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది.