Shashi Tharoor: ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

ప్రస్తుతం విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్‌గా శశి థరూర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన అత్యంత అరుదైన ఆంగ్ల పదాలను తన ట్వీట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. గత ఏడాదిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రెంచ్‌ భాషలో ప్రసంగించి ఎంబసీ, కాన్సులేట్లు, అలయెన్స్ ఫ్రాంకాయిస్, మిలిటరీ అటాచెస్ అధికారులను ఆశ్చర్యపరిచారు.

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‭కు అత్యున్నత గౌరవం లభించింది. విశిష్టమైన సైనిక లేదా పౌర ప్రతిభను చూపించే వారికి ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబారి ఓ లేఖ ద్వారా ఆయనకు ఈ సమాచారాన్ని తెలిపారు. షెవలియర్ డీ లా లెజియన్ డీహొన్నేర్ (ది లెజియన్ ఆఫ్ ఆనర్) పేరుతో 1802లో నెపోలియన్ బోనపార్టీ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వ మంత్రి ఎవరైనా భారత దేశ పర్యటనకు వచ్చినపుడు ఈ పురస్కారాన్ని థరూర్‌కు ప్రదానం చేస్తారు.

ప్రస్తుతం విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్‌గా శశి థరూర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన అత్యంత అరుదైన ఆంగ్ల పదాలను తన ట్వీట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. గత ఏడాదిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రెంచ్‌ భాషలో ప్రసంగించి ఎంబసీ, కాన్సులేట్లు, అలయెన్స్ ఫ్రాంకాయిస్, మిలిటరీ అటాచెస్ అధికారులను ఆశ్చర్యపరిచారు.

కాగా, థరూర్‭కు ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘ఫ్రాన్స్‌తో మన సంబంధాల పట్ల సంతోషించేవారిలో, ఫ్రెంచ్ భాషను ప్రేమించేవారిలో, ఆ సంస్కృతిని ఇష్టపడేవారిలో ఒక వ్యక్తిగా నన్ను ఈ విధంగా గుర్తించడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఈ విశిష్టతను ప్రదానం చేయడానికి నేను తగిన వ్యక్తినని భావించినవారందరికీ నా కృతజ్ఞతలు, వారిపట్ల నా గౌరవ భావాన్ని ప్రకటిస్తున్నాను’’ అని సమాధానం ఇచ్చారు.

BJP workers clash: తిరంగా యాత్రలో బీజేపీ కార్యకర్తల మధ్య కుమ్ములాట

ట్రెండింగ్ వార్తలు