cow shelters in Varsitys : విద్యార్థులకు హాస్టళ్లు ఉన్నట్లే యూనివర్శిటీల్లో గోవులకు షెల్టర్లు ఉండాలి : కేంద్ర మంత్రి

విద్యార్థులకు హాస్టళ్ల ఉన్నట్లే యూనివర్శిటీల్లో గోవులకు షెల్టర్లు ఉండాలి అని కేంద్ర మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా అన్నారు.

Varsity campus should have cow shelters: బీజేపీ ప్రభుత్వం గోవుల్ని సంరక్షించడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయంతెలిసిందే. గోవుల కోసం భారత్  చట్టాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో యూనివర్శిటీల్లో ఆవుల కోసం ఓ షెల్టర్ ఉండాలని అన్నారు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా. యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థుల హాస్టళ్ల ఉన్నట్లుగానే క్యాంపస్ ల్లో గోవుల కోసం కూడా ఒక పెద్ద షెల్టర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా అన్నారు.

Read more : ఆవును చంపితే 5 లక్షల జరిమానా..10 ఏళ్ల జైలుశిక్ష : UP సర్కార్

శుక్రవారం (నవంబర్ 12,2021) డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో యూనివర్సిటీలో ‘కామధేను అధ్యయన్‌ అండ్‌ సోద్‌పీఠ్‌’ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ సూచనలు చేశారు. గోవుల్ని సంరక్షించటానికి కోసం ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి అవసరం ఉందని..ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

మనదేశ సంప్రదాయంలో గోవులు పవిత్రమైనవనీ..మనం గోవుల్ని పూజిస్తుంటామని అన్నారు. మన సంప్రదాయంలో పశువులు భాగమని.. పశువులే మన సంపదకు కొలమానమని అన్నారు. గోవుల సంరక్షణ..పశు సంరక్షణ వంటి కార్యక్రమాలు మనల్ని సర్వతోముఖాభివృద్ధికి తీసుకెళ్తుందని అన్నారు. భారతీయులకు ఆవులకు విడదీయరాని బంధం ఉందన్నారు. కానీ దురదృష్టవశాత్తు గోవుల విలువ వాటి గొప్పదనం గురించి చాలామందికి తెలియటంలేదనీ..మరికొందరు ఆవుల ప్రాముఖ్యత గురించి మర్చిపోయారని ఇది విచారించాల్సినవిషయం అని అన్నారు. యూనివర్సిటీలో ‘కామధేను అధ్యయన్‌ అండ్‌ సోద్‌పీఠ్‌’ను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని మంత్రి రూపాలా ప్రశంసించారు.

Read more : ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎంఐఎం నేత డిమాండ్

ట్రెండింగ్ వార్తలు