ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎంఐఎం నేత డిమాండ్

  • Published By: nagamani ,Published On : June 11, 2020 / 06:03 AM IST
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎంఐఎం నేత డిమాండ్

గోహత్యకు పాల్పడితే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చట్టం ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఎంఐఎం పార్టీ నేత సయ్యద్ అసిమ్ వకార్ తమదైన శైలిలో ఘాటుగా స్పందించారు. 

 ప్రభుత్వాలు ఆవులను సంరక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అస్సాం ఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ మీడియాతో మాట్లాడుతూ..వట్టిపోయిన ఆవులను అమ్మేవారిని కూడా శిక్షించాలని..వారికి రూ. 20 లక్షల జరిమానా విధించాలని కోరారు. ఆవులపై అంత ప్రేమ ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించాలనీ..వాటిని కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలసి ఒక పథకం తీసుకురావాలని అన్నారు.  

ప్రస్తుతం ఆవులు రోడ్లపై తిరుగుతూ చెత్తాచెదారం తింటున్నాయని, ప్లాస్టిక్ కవర్లు తింటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయనీ..మురిగి కాలువల్లో నీళ్లు తాగుతున్నాయనీ ఇవనీ ప్రభుత్వానికి కనిపించటంలేదా? అని ప్రశ్నించారు. సంరక్షణ లేని ఆవులను ప్రభుత్వాలే కనుగోలు చేసివాటిని  గోశాల్లలో సంరక్షించాలని డిమాండ్ చేశారు. 

Read: ఆవును చంపితే 5 లక్షల జరిమానా..10 ఏళ్ల జైలుశిక్ష : UP సర్కార్