Pawan Kalyan: పొలిటికల్ స్కూల్‌గా జనసేన..! పవన్ కల్యాణ్ ప్లానేంటి? పాలిటిక్స్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా?
జనసేన అధినేత పవన కల్యాణ్ ఏం చేయబోతున్నారు.. అసలు ఆయన డ్రీమ్ ఏంటి? ఆ రూట్ మ్యాప్‌ను ఇంప్లిమెంట్ చేసేందుకు ఏం చేయనున్నారు..?

Pawan Kalyan: పాలిటిక్స్ ఈజ్ ఆల్‌వేస్ డైనమిక్స్. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు. పైగా ప్రజెంట్ పాలిటిక్స్ వెరీ డిఫరెంట్. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ప్రత్యక్షం అవుతారో..ఎందుకు పార్టీ మారుతారో అంతకంటే అర్థం కానీ పొలిటికల్ సినారియో ఈనాటిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయాలు అవసరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నట్లుగా మారిపోయిన సిచ్యువేషన్.
కానీ జనసేన పుట్టుక వేరు. దాని నడుస్తున్న తీరు వేరు. ఓ లక్ష్యం కోసం..భవిష్యత్ కోసం పక్కా స్కెచ్ పకడ్బందీ ప్లాన్‌తో పని చేసుకుంటూ వస్తున్నారు పవన్ కల్యాణ్. తానే రెండు చోట్ల ఓడినా.. ఆయన పార్టీ ఎక్కువ రోజుల ఉండదని విమర్శలు వచ్చినా.. ఆయనెక్కడా తగ్గలేదు. పదవుల కోసం ఆరాటపడలేదు.
అలా పవన్‌పై ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేయడంలో కూడా తప్పులేకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఎంతోమంది పార్టీలు పెట్టి కొన్ని రోజులు పాలిటిక్స్‌లో ఉండి తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్న వారున్నారు. కానీ పవన్ రూటు సెపరేటు. ఆయనదంత ఫ్యూచర్ ప్లాన్. అధికారం, ప్రతిపక్షం అనే మాటల కంటే..మంచి కోసం మార్పు అనే లైన్‌లోనే పనిచేసుకుంటూ వస్తున్న సేనాని ఇప్పుడు సరికొత్త స్కెచ్ వేస్తున్నారట.
అధికారం కోసమో, అవసరాల కోసమో జనసేన ఏర్పడలేదు..
జనసేన అనేది అధికారం కోసం..అవసరాల కోసం ఏర్పడలేదని పవన్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. రాబోయే తరానికి మంచి నేతలను..మంచి రాజకీయ సంప్రదాయాలను అందించాలనేది తన తపన అని పవన్ తన ఫ్యూచర్ ప్లాన్‌ను స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ మ్యాప్‌ను ఇంప్లిమెంట్ చేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. భవిష్యత్ తరానికి మంచి లీడర్లను అందజేయాలని..వాళ్లు ప్రజల బాగోగుల కోసం..దేశం కోసం పనిచేసేలా ఉండాలని పవన్ కలలు కంటున్నారట.
త్రీపాయింట్ ఫార్ములాపై పవన్ కల్యాణ్ కసరత్తు..
అందుకోసం త్రీపాయింట్ ఫార్ములాపై కసరత్తు చేస్తున్నారట సేనాని. కార్యకర్తలు, లీడర్లను ఇతర పార్టీల్లో నుంచి తీసుకోవడం కాకుండా..జనసేన పార్టీ అనేదే ఒక రాజకీయ బడిగా..పొలిటికల్ స్కూల్‌గా ఉండాలనేది పవర్ స్టార్ డ్రీమ్ అంటున్నారు. పవన్ మదిలో ఉన్న త్రీపాయింట్ ఫార్ములాపై ఐఐటీ మద్రాస్ ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కషన్స్ జరుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి పట్టుకొమ్మల్లాంటి కార్యకర్తలను ఎంచుకుని..వారికి బలమైన శిక్షణ ఇచ్చి అంచెలంచెంలుగా లీడర్లను తయారు చేయాలనేది ప్రధాన లక్ష్యమట.
ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు వస్తే..అవసరం ఉన్నంత సేపే తమ వెంట నడిచి..తర్వాత తమదారి తాము చూసుకుంటారు. పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేసే కార్యకర్తలు ఉంటే పార్టీ లాంగ్ లీవ్ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ పాలిటిక్స్ చేయొచ్చనేది సేనాని వ్యూహమట. అందుకే మొదట జనసేన పార్టీ సిద్ధాంతాలపై యువతకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారట.
ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులు, ప్రజా సేవపై వారికి బలమైన ఆకాంక్షను పెంచుతారట. తర్వాత పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లేందుకు వారిలో స్ఫూర్తిని నింపి..నెమ్మదిగా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటూ పోతూ జనసేన స్కూల్‌లోనే ఫ్యూచర్ లీడర్లను తయారు చేయాలనేది పవన్ మదిలో ఉన్న ఆలోచన అంటున్నారు.
భవిష్యత్ లీడర్లుగా..ప్రజలకు సేవ చేయాలని..ఓ సిద్ధాంతం ప్రకారం పని చేయాలని పట్టుదల ఉన్న వారిని జనసేనలోకి తీసుకుని..ఇలా ట్రైనింగ్ ఇచ్చి లీడర్లుగా తీర్చిదిద్ది..వారిని పార్టీ పదవుల్లోకి తీసుకునే ప్లాన్ ఉందట. అలా వారిలో ఉన్న స్రెంథ్, చరిష్మాను బట్టి జనసేనలో కీలక పోస్టులు ఇవ్వాలని అనుకుంటున్నారట.
నాయకులు వస్తుంటారు. పోతుంటారు. బట్ పవన్ కల్యాణ్ వేరు అంటున్నారు జనసేన నేతలు. ఆయన ఐడియాలజీ..ఫ్యూచర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఆయన అనుకున్నట్లుగా త్రీపాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ అయితే..కచ్చితంగా పాలిటిక్స్‌లోనే పవన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తారని..జనసేన ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు.
ఈ వ్యూహాలు అమలు చేసే లక్ష్యంతోనే పవన్ జనసేనను జాతీయ పార్టీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారట. మరి సేనాని వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో? ఆయన కలలు కంటున్నట్లు జనసేన పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చే ఫ్యూచర్ లీడర్లు ఎవరో చూడాలి.