Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. క్రేజీ డీల్స్ మీకోసమే..

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌లో పిక్సెల్ 10, 10 ప్రో, ప్రో XL ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. క్రేజీ డీల్స్ మీకోసమే..

Flipkart Big Billion Days Sale

Updated On : September 10, 2025 / 7:10 PM IST

Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు 24 గంటల ముందుగానే యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌కు ముందు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు తమకు ఇష్టమైన ఫోన్లను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో గూగుల్ పిక్సెల్ 9 భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XLతో సహా ఇతర పిక్సెల్ ఫోన్‌లు కూడా భారీ ధర తగ్గింపు పొందుతాయి.

ఈ డిస్కౌంట్లతో పాటు కొనుగోలుదారులు అదనపు సేవింగ్స్ కోసం బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సమయంలో డిస్కౌంట్ ధరలకు లభించే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల పూర్తి జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Oppo Find X9 Series : కొత్త ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలివే..

గూగుల్ పిక్సెల్ 10 :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ గత నెలలో రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అన్ని ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ తర్వాత రూ.67,999 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ట్రేడ్-ఇన్ వాల్యూపై అదనంగా రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో :
16GB ర్యామ్, 256GB స్టోరేజ్ గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర రూ.1,09,999, అయితే, ఫ్లిప్ కార్ట్ బీబీడీ సేల్‌లో రూ.94,999కి అందుబాటులో ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ :
అదనంగా, గూగుల్ పిక్సెల్ 10 ఎక్స్ఎల్ ధర కూడా రూ.15వేలు తగ్గనుందని సమాచారం. ఈ పిక్సెల్ ఫోన్ ప్రారంభ ధర రూ.1,24,999 నుంచి తగ్గి రూ.1,09,999 కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ :
లేటెస్ట్ జనరేషన్ గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL లాంచ్ ధర రూ.1,24,999 నుంచి రూ.84,999కు అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు తమ ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూను మినహాయించి రూ.40వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో :
గూగుల్ పిక్సెల్ 8 ప్రోపై రూ.62వేలు భారీ తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్, ఇతర ఆఫర్లతో కొనుగోలుదారులు రూ.44,999 నుంచి తగ్గింపు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 2023లో రూ.1,06,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది.