Shivayyaku Koti Vrukshaarchana : ‘శివయ్యకు కోటి వృక్షార్చన’ పాట రిలీజ్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన ‘‘ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన’’ పాటను ఎంపీ సంతోష్ కుమార్ విడుదల చేశారు.

Shivayyaku Koti Vrukshaarchana: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన ‘‘ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన’’ పాటను ఎంపీ సంతోష్ కుమార్ విడుదల చేశారు.

ఈ పాట విన్న సంతోష్ కుమార్ చాలా చక్కగా పాటను తీశారని, భక్తి భావంలో కూడా పచ్చదనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు అని కొనియాడారు. ఈ పాటలో ఉపయోగించిన శివ లింగాన్ని పచ్చని ఆకులతో తయారు చేయడం చాలా బాగా నచ్చింది అని తెలిపారు. ఈ పాటను రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ: ‘మానవుడు జీవితం చివరి దశలో కూడా ఏదైనా సాధించవచ్చని ఈ పాట ద్వారా తెలపడానికి ప్రయత్నం చేశాం.. జీవితంలో చివరి ఘట్టమైన స్మశానంలో పచ్చని శివలింగం పెట్టడానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని తెలిపారు. మొత్తం ఎండిపోయిన మొక్క కూడా చిన్న చిగురు ద్వారా మహావృక్షం అవుతుంది అని అదేవిధంగా జీవితంలో ఎప్పుడు కూడా అధైర్య పడవద్దని మన మొక్కవోని ధైర్యంతోనే ముందుకు కొనసాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు’’ అని తెలిపారు.

ఈ పాటకు నటుడు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి సలహాలు సూచనలు, రచయితగా కాసర్ల శ్యామ్, డైరెక్టర్‌గాసాయి కుమార్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, నటుడు ధనరాజ్, తెలంగాణ సుజాత, సురేష్, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు