×
Ad

పెళ్లి డేట్ ఫిక్స్..

  • Published On : December 26, 2020 / 04:49 PM IST

Singer Sunitha Marriage Date: ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లోనే వీరి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. పెళ్లికి ఇంకొంత టైమ్ఉండటంతో.. వీరు.. తమ సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చి సందడి చేశారు.

రీసెంట్‌గా రామ్-సునీతల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 2021 జనవరి 9వ తేదిన వీరిద్దరూ ఒకటి కానున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తర్వాత సినీ, మీడియా మిత్రులకోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.