ఫుల్ ఖుషీగా సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్..

Singer Sunitha: ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్‌లోనే వీరి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

 

పెళ్లికి ఇంకొంత టైమ్‌ ఉండటంతో.. వీరు.. తమ సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇచ్చినట్లుగా వార్తలతో పాటు కొన్ని ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

హీరో నితిన్, సునీతకు కాబోయే భర్తకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ పార్టీ హోస్ట్ చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో సునీత, రామ్‌లు కేక్‌ కట్‌ చేసి ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

శనివారం (డిసెంబర్ 19 రాత్రి) జరిగిన ఈ పార్టీకి టాప్‌ సింగర్స్‌తో పాటు కొందరు సెలబ్రిటీస్‌ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. రేణూ దేశాయ్‌, యాంకర్ సుమ తదితరులు ఈ పార్టీలో సందడి చేసినట్లు సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేశారు.