‘బోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బ్రతుకే సో బెటర్’..
- sekhar
- Published On : December 11, 2020 / 01:11 PM IST
Solo Brathuke So Better: సుప్రీం హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం ఈ సినిమా టైటిల్ ట్రాక్ రిలీజ్ చేశారు.
‘‘సాటి సోలో సోదరసోదరియమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే…Solo Brathuke So Better! మన సింగిల్స్ అందరికి అంకితం!’’ అంటూ తేజ్ ట్వీట్ చేశాడు. థమన్ ట్యూన్‌కి సీతారామశాస్త్రి లిరిక్స్ రాయగా, విశాల్ పాడాడు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ కానుంది. తేజ్ నటించిన ‘ప్రతి రోజు పండగే’ మూవీ గతేడాది డిసెబంర్ 20న విడుదలైంది. మళ్లీ సంవత్సరం తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. సంగీతం : థమన్, కెమెరా : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా.
