Soorarai Pottru Enters Panorama Section Of Shanghai International Film Festival 2021
Soorarai Pottru: విలక్షణ నటుడు సూర్య, అపర్ణ బాలమురళి జంటగా.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా తెరకెక్కిన ‘సూరరై పోట్రు’.. (ఆకాశం నీ హద్దురా) తమిళ్, తెలుగు భాషల్లో గతేడాది ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది.
సూర్య, అపర్ణల నటన, దర్శకురాలు సుధ కొంగర టేకింగ్‌కి సినీ ప్రముఖుల నుండి కూడా మంచి స్పందన లభించింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ బరిలో మనదేశం తరపున ఈ చిత్రం 93వ ఆస్కార్ నామినేషన్స్ పరిశీలనకు ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు కూడా ఈ సినిమా ఎంపికైంది.
ఇప్పుడీ సినిమాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎస్ఐఎఫ్ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వరకు జరిగే చిత్రాల ప్రదర్శనలో పనోరమ కేటగిరీల ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేశారు..