Sri Simha : ‘యమదొంగ’ లో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసింది ఈ హీరోనే! తర్వాత ‘బాహుబలి’ లో కూడా..

ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహా కోడూరి తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘తెల్లవారితే గురువారం’ మూవీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడే ఈ శ్రీ సింహా..

Sri Simha: ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహా కోడూరి తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘తెల్లవారితే గురువారం’ మూవీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడే ఈ శ్రీ సింహా..

మనోడు హీరో కాకముందు కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడన్న సంగతి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.. ఇంకో విశేషం ఏంటంటే శ్రీ సింహా యాక్ట్ చేసిన సినిమాలన్నీ జక్కన్న డైరెక్ట్ చేసినవే.. మొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘యమదొంగ’ లో చిన్నప్పటి తారక్ క్యారెక్టర్‌లో అదరగొట్టేశాడు.

తర్వాత సునీల్‌తో రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ లోనూ ఓ వేషం వేశాడు. ‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ లోనూ నటించిన సింహా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘రంగస్థలం’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాడు. అక్కడి నుండి ‘మత్తు వదలరా’ తో హీరోగా టర్న్ అయ్యాడు. ఫ్యామిలీ అంతా సినిమా ఫీల్డ్‌కి చెందినవారే కావడంతో ఎంట్రీ ఈజీ అయినా.. యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ తెచ్చిపెట్టే సినిమాలు చేస్తానంటున్నాడు శ్రీ
సింహా..

ట్రెండింగ్ వార్తలు