Gaalodu
Gaalodu: సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో రూపొందిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ సూపర్‌హిట్ కాంబినేషన్‌లో ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రారంభమైంది. మే19 సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తూ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
క్యాచీ టైటిల్‌తో పాటు ఇన్నోవేటివ్‌గా ఉన్న ఈ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంస్కృతి ఫిలింస్ పతాకంపై రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ : ‘‘మాస్‌లో సుడిగాలి సుధీర్‌కి ఎంత ఇమేజ్ ఉందో చెప్పడానికి మా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రానికి వచ్చిన భారీ ఓపెనింగ్స్ నిదర్శనం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్నిభారీ ఎత్తున రూపొందిస్తున్నాం. ఈ రోజు సుధీర్ బర్త్‌డే సందర్భంగా ‘గాలోడు’ అనే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.